నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 30,నారాయణపేట జిల్లా కేంద్రంలోని నూర్జహాన్ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు టీమ్ పోలీసులు మహిళల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, మరియు హెల్ప్‌లైన్ నంబర్లు (100, 1091, 181) గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ… విద్యార్థులు చిన్నతనం నుండి బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తల్లిదండ్రులకు తమ గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి, స్కూల్, మరియు కాలేజ్ కి వచ్చిపోయే సమయంలో ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే విద్యార్థులు ధైర్యంగా తమకు ఎదురయ్యే వేధింపుల గురించి నిస్సంకోచంగా షి టీమ్ పోలీసులకు తెలుపాలని లేదా షి టీమ్ నంబర్ 8712670398 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు షి టీమ్ పోలీసులు చేనప్ప, ఇనిస్టిట్యూట్ సిబ్బంది పాల్గొన్నారు.





