నేటి సాక్షి :ముంత తుఫాను కురిసిన భారీ వర్షానికి భవనాసి వాగు ఉదృతంగా ప్రవహించింది ఈ వాగులో కొత్తపల్లి మండలం నాగంపల్లి కు చెందిన జల్లె నాగేశ్వరావు అనే వ్యక్తి గల్లంతయినాడు. ఈ మృతదేహం కోసం కర్నూల్ నుంచి వచ్చిన 28 మంది రెస్క్యూటివ్ సభ్యులు గాలించారు. అయితే మృతదేహం సాయంత్రం వరకు లభ్యం కాలేదు. అతను తీసుకెళ్లిన బైక్ మాత్రమే కనపడింది.ఈ సంఘటనలో స్థలానికి చేరుకున్న డిప్యూటీ తాసిల్దారు పటాన్ బాబు ఎస్ఐ సురేష్ బాబు ఘటన స్థలానికి వెళ్లి దగ్గరుండి పర్యవేక్షించారు. ఘటన స్థలానికి డిఎస్పి రామాంజనేయులు సిఐ సురేష్ కుమార్ రెడ్డి చేరుకుని పర్యవేక్షించారు.





