నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………..సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ కౌన్సిలర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ACS రాజు.భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.నాయకులు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశానికి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు, భారత దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన కృషిని శ్లాఘించారు. అంతే కాకుండా ఐక్యతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా స్వతంత్ర భారతావని రూపశిల్పిగా, రైతుల అభ్యున్నతికి పాటుబడిన వ్యక్తిగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారన్నారు. 550 సంస్థానాలను విలీనం చేసి ఐక్యభారతాన్ని నిర్మించిన ఘనత పటేల్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిన పెళ్లి కాశీనాదం, చిట్ల గంగాధర్, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, నరేందుల శ్రీనివాస్, అడ్వకేట్ మ్యదరి అశోక్, వేముల దెవరజం, బండారి మల్లికార్జున్ , కొత్తకొండ బాలన్న, చంద రవీందర్ రావు , రాజేశ్వర్ రావు, ఎడమల వెంకన్న, బొందుకూరి శ్రీనివాస్, కృష్ణ, ప్రవీణ్, గాడసు భుమన్నా, సిరిపురం గంగారాం , మ్యాదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





