నేటి సాక్షి, నారాయణపేట,అక్టోబర్ 31,నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం ఇందిరా గాంధీ కూడలిలో ఇంద్ర గాంధీ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు, ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.. ఈ విషయమై జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఇంద్ర గాంధీ పాలనలోనే బీద బడుగు బలహీన వర్గాలకు ఇల్లు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు . నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మళ్లీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు .ఈ విషయమై ఇంద్ర గాంధీ గురించి మాట్లాడుతూ,భారత రాజకీయాల్లో అద్భుతమైన వ్యక్తిత్వం అని ఇందిరా గాంధీని ఇప్పటికీ ప్రశంసిస్తారని. ఇందిరాగాంధీ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని చేధించడంలో బిజీగా ఉండేవారు అని అన్నారు. నేడు ఇందిరా. అనంతరం ఐదు నిమిషాలు మౌనం పాటించి ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, గొల్ల కృష్ణయ్య, పట్టణ అధ్యక్షులు కంచరి హరీష్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొల్ల కృష్ణయ్య , కొత్తపల్లి మాజీ సర్పంచ్ రాజు, రామకృష్ణారెడ్డి, పోలమోని రామకృష్ణ, కాటే కొండ ఆంజనేయులు, జంగిడి జంగిడి రవి, జంగిడి శ్రీనివాసులు, దామోదర్ రెడ్డి, పెంట మీద రాఘవేందర్, రఘు టైసన్, గూబ చెన్నయ్య, జి. గోవర్ధన్, అల్లా బకాష్, గొల్ల ఆంజనేయులు, గొల్ల రాజు, మంగలి రఘు, తదితరులు పాల్గొన్నారు.





