Sunday, March 15, 2026

*మెనూ చార్జీలు పెంచకుండా నాణ్యమైన భోజనాలు అందించడం సాధ్యం కాదు-ఏఐటీ యుసి*————————————– *ఒకటే కూరకు డబ్బులు చెల్లించి, రెండు కూరలు తయారు చేయాలని, అధికారులు ఒత్తిడిచేయడం సమంజసం కాదు*జగిత్యాల -..

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………,…………………………. ఈరోజు ఏఐటీయూసీ అనుబంధ, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, జగిత్యాల జిల్లాలోని మధ్యాహ్న భోజన వంట జగిత్యాల కార్మికులు,జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడించి,ధర్నా నిర్వహించారు.ఇన్చార్జి జగిత్యాల జిల్లా విద్యాధికారి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్.*జగిత్యాల జిల్లా మధ్యాహ్న భోజనం ఇంచార్జ్ వెన్న మహేష్ ప్రధానమాట్లాడుతూ*24 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకంలో వంట కార్మికులుగా పనిచేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తూ, ఆ వంట బిల్లులు,వేతనాలు 9 నెలలు పెండింగులో ఉంటే కార్మికులు ఎలా పనిచేస్తారు అన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క నెల వేతనం కొంచెం అలస్యం అయినా ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితులలో వంట కార్మికులు ఎలా వంటలు చేస్తారు అన్నారు.ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఈ విషయాన్ని చాలా ఈజీగా తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు.దానితోపాటు ఒకటే కూరకు డబ్బులు చెల్లిస్తూ, రెండు కూరలు తయారు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.గత ప్రభుత్వం చివరలో ప్రవేశపెట్టిన అల్పాహారం బిల్లులు పది నెలలుగా చెల్లించకపోతే కార్మికులు ఎలా తట్టుకుంటారు అన్నారు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే రూ, 10,000 ఇస్తామని ప్రకటించి,నేటికీ అమలు చేయడం లేదు అన్నారు.మెనూ చార్జీలు ప్రభుత్వం ఇస్తున్న వాటికి, మార్కెట్లో లభిస్తున్న ధరలకు ఏమాత్రం సరిపోయే పరిస్థితులు లేనప్పుడు కార్మికులు అప్పుల పాలుకావలసి వస్తుంది అన్నారు.కార్మికులను కొంతమంది ప్రధానోపాధ్యాయులు, చోటామోటా నాయకులు మెనూప్రకారం వంటలు చేస్తేనే ఉండండి లేకుంటే ఊరుకోండి మరొకరితో వండిస్తామని బెదిరింపులు గురి చేస్తున్నారు.ఇది ఎంతవరకు సమంజసం అన్నారు,, కనుక ప్రభుత్వం మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి 25 రూపాయలైనా చెల్లించాలి, లేదంటే సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలిని డిమాండ్ చేశారు.ఇన్ని ఇబ్బందులలో మరొక కొత్త పథకం రాగిజావ, రాగి జావా తయారు చేయడానికి ఒక పిల్లవాడికి రెండు రూపాయలు ఇవ్వవలసింది పోయి, కేవలం 25 పైసలు చెల్లిస్తే ఎలా తయారు చేస్తారు అన్నారు. కనుక సమస్యలన్నీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 12వ తేదీన చలో హైదరాబాద్ కమిషరన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారుAITUC జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు కార్యదర్శిMD ముఖరం మాడిశెట్టి కిరణ్. హనుమంతు. గుగ్గిళ్ళ శారద. సరస్వతి. MD షంషేర్. అంకుష్. రాధా. పద్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News