Sunday, March 15, 2026

భాగ్యనగరంలో నవంబర్ 1 న లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కొరపాక అంజి మాదిగ

నేటి సాక్షి ఉప్పల్, అక్టోబర్ 31దేశ రాజధానిలో అత్యున్నత న్యాయవ్యవస్థైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 1 న ఛలో హైదరాబాద్ పేరుతో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కొరపాక అంజి మాదిగ అన్నారు.మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు. ఈ దాడి జరిగి 18 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా? అని ప్రశ్నించారు.అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు.దళితులు ఎంత ఉన్నత స్థానానికి కష్టపడి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతుందని అన్నారు.అందుకే గవాయిపై దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని అన్నారు. గవాయ్ పైన జరిగిన దాడి వల్ల దేశంలో ఉన్న దళితుల హృదయాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని అన్నారు.కానీ 18 రోజులుగా ఎదురు చూస్తున్నా నేటికీ న్యాయం జరగలేదని, కనుకనే ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేయాలి.నిందితుడిని అరెస్టు చేసి జైలులో పెట్టాలి.అలాగే ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ చేత విచారణ జరిపించి దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాలి.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని అన్నారు.చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 1 న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ర్యాలీలో ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తిప్పారపు లక్ష్మణ్ మాదిగ. జిల్లా ఇన్చార్జ్ కేశపాక రామ్ చందర్ మాదిగ, ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మార్పీఎస్ నాచారం నాయకులు ఏర్పుల నర్సింగరావు మాదిగ, పొన్నాల మహేందర్ మాదిగ, ఏళ్ల సంతోష్ మాదిగ ,కొరపాక యోగేష్ మాదిగ, కుమార్ మాదిగ, చింత మధు మాదిగ,సుమన్ మాదిగ ,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News