నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)కర్లపాలెం మండలం లో 20 గ్రామ పంచాయతీ లలో 4 ఆధార్ సెంటర్ల యాజలి,గణపవరం, పాతనదయపాలెం, సమ్మెటవారిపాలెం గ్రామాలలో ఉండగా సచివాలయం సిబ్బంది మారడంతో 3 లాగిన్ అవ్వడం లేదని ఒక్క సమ్మెటవారిపాలెం పంచాయతీ లో మాత్రమే పనిచేస్తున్నట్లు ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులకు ఆధార్ అప్డేట్ లు ఉన్నందున మండల పరిషత్ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు దీనిని ముఖ్యంగా 10 వ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.





