రన్ ఫర్ యూనిటీ…- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 150వ (ఏక్తాదివాస్) సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” 2 కె రన్ నిర్వహించిన చందుర్తి పోలీస్…భారత ఐక్యతా స్ఫూర్తికి, ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం, దేశభక్తి భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి (ఏక్తాదివాస్) పురస్కరించుకొని శుక్రవారం రాజన్న సిరిసిల్ల ఎస్పి మహేష్ బి గీతే ఆదేశాల మేరకు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి ఎస్సై జే రమేష్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి అమరవీరుల స్థూపం, అంబేద్కర్ చౌరస్త మీదుగా 2కె రన్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు అథ్లెట్స్, యువకులు, 108 సిబ్బంది పాల్గొనడం జరిగింది.





