నెటిసాక్షి, మిర్యాలగూడ : ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో అకాల వర్షాలు పడి రైతుల చేతికి వచ్చిన పంటలు మొత్తం కిందపడి నీట మునిగి రైతులు ఆర్థికంగా నష్టపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే క్షేత్ర స్థాయిలో అధికారులతో సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని దామరచర్ల మండలసిపిఐ కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.శుక్రవారం దామరచర్ల మండలంలోని కొండ్రపోలు క్యాంపు ప్రాంతంలో, రైతులతో కలిసి అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అప్పులు చేసి, పంటలు పండిస్తే అకాల వర్షానికి పంట చేతికి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొండ్రపోలు గ్రామ రైతులు నరసయ్య, శ్రీనివాస్ మారెమ్మ, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.





