నేటి సాక్షి – లక్షేట్టిపేట(రేగుంట ప్రసాద్)అక్టోబర్ 31: పట్టణానికి చెందిన లక్ష్మీ, అజయ్ లు కొంతకాలం క్రితం తమ ఫోన్ లు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఎస్సై సురేష్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. బజార్ ఏరియాలో మిస్ అయినా ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ట్రేస్ చేసి, మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. తమ ఫోన్ లు దొరకడంలో సహాయపడిన పోలీసులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్, సిబ్బంది ఉన్నారు.





