Sunday, March 15, 2026

రన్ ఫర్ యూనిటీ గొల్లపల్లిలో 2కే రన్*..

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ ఐక్యత పరుగు కార్యక్రమం ఎస్సై ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. పోలీస్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు ,ప్రజా ప్రతినిధులు విద్యార్థులు, క్రీడాకారులు, మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల కేంద్రంలోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ఐక్యత పరుగు గోవిందపల్లి అంబేద్కర్ విగ్రహం వరకు వరకు కొనసాగింది. సర్దార్ పటేల్ దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఐక్యత సూత్రధారి. ఆయన స్ఫూర్తితో మనమూ సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పాలి. ప్రతి పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలి. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ద్వారా దేశ భక్తిని, ఐక్యతను ప్రజల్లో, యువతలో జాతీయతా భావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, జాతీయ స్ఫూర్తిని పెంపొందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది.ఈ యూనిటీ ఫర్ రన్ 2 కిలోమీటర్లు లో మొదటి స్థానం అభి చిల్వకోడూరు రెండవ స్థానం పడాలసుదర్శన్, మూడవ స్థానం జెడల రాము విజేతలుగా నిలిచారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News