Sunday, March 15, 2026

కాంగ్రెస్ పాలనలోనే మత్సకారుల అభివృద్ధి పేట జిల్లాకు కోటి చాపలు మంజూరు పేట మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్……

నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 1, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మత్స్యకారులు అభివృద్ధి చెందడం జరిగిందని నారాయణపేట జిల్లా మత్స్య కార్మిక సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షులు కాంత్ కుమార్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మత్సకారుల సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 80 వేల చేప పిల్లలను చెరువులోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాకు మత్స్యకారులకు కోటి 85 లక్షల చేప పిల్లలను మంజూరు చేయడం జరిగిందన్నారు. నేటి వరకు కోటి చేప పిల్లలను ఆయా చెరువుల్లో విడుదల చేయడం జరిగిందని ఆయన వివరించారు. బిసి డి నుండి బీసీఏలోకి మత్స్యకారులను మార్చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించడం జరిగిందన్నారు. ఇట్టి విషయాన్ని మత్స్య కార్మిక సంఘం శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారికి కూడా విన్నవించడం జరిగిందని ఆయన వివరించారు. వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి రావడం అదృష్టం అన్నారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్, చాపల సంఘం అధ్యక్షుడు కాని గంటి నారాయణ, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి, గొల్ల కృష్ణయ్య, నాయకులు అనిమిరెడ్డి, పెంట మీద నర్సింలు, లక్ష్మీ రామస్వామి, సురిటి పండ్ల చంద్రశేఖర్, జెడి శ్రీనివాసులు, బసంత్ కుమార్ వెంకటేష్, టైలర్ మొగులన్న, అడుగు నీ చంద్రశేఖర్, రవి కిరణ్, మరికల్ మండల వ్యవసాయ శాఖ అధికారి రహిమాన్, ఫీల్డ్ అసిస్టెంట్లు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News