Sunday, March 15, 2026

తల్లిదండ్రులను గౌరవించాలి విద్యార్థులకు అవగాహన సదస్సు…..

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 1, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో శనివారం తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ట్రస్ట్ లైవ్ ద్వారా ఆరో తరగతి నుండి పదవ తరగతికి విద్యార్థులకు విలువల విద్య అనే భాగంలో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అనే అంశంపై శ్రీవాణి సౌమ్య మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం వారికి సాయపడటం ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉండాలని పిల్లలకు కథల ద్వారా వివరించడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలపై చాలా ప్రేమ ఉంటారని ప్రపంచంలో తల్లిదండ్రులకు మించిన దైవం లేదని వారు ఎదగడానికి పిల్లలకు చాలా కష్టపడి ఉన్నత విద్యలను నేర్పించడం జరుగుతుందని పిల్లలను సరైన పద్ధతిలో తీసుకొని రావడానికి తల్లిదండ్రులే ముఖ్యమైన పాత్ర వహిస్తారని తల్లిదండ్రులు పిల్లలు సహాయకంగా ఉండాలని తెలియజేశారు మరియు తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక మానసిక వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు విజయ భాను ప్రకాష్ నిర్మల మధుసూదన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News