నేటి సాక్షి పాలేరు ,నవంబర్ 1:తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు అమరవీరుడు గట్టిగండ్ల వెంకన్న స్థూపం వద్ద నివాళులర్పించారు . ఈ సందర్బంగా మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ.. భూమి ,భుక్తి పేద ప్రజల విముక్తి కోసం పోరాడి అమరులైన అమరవీరులు అజేయులని , వారి త్యాగం వృధా కాదని అన్నారు.. దోపిడీ పాలక వర్గాలు పేద ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను బూటకపు ఎన్కౌంటర్ పేరిట హతమార్చినంత మాత్రాన విప్లవం అంతం కాదని , దేశంలో దోపిడీ ఉన్నంతవరకు ప్రజా పోరాటాలు వర్ధిల్లుతాయని అన్నారు. ప్రజా పోరాటాలను పాలకులు అణిచి వేయాలని కుట్ర చేసినప్పుడు ప్రజలు సాయుధ తిరుగుబాటు దారి ఎంచుకోక తప్పదని అన్నారు.. వేలాది వీరులను ప్రభుత్వాలు బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేసినంత మాత్రాన విప్లవోద్యమం పురోగమించటం తథ్యం అన్నారు. నేడు బిజెపి మతత్వ ప్రభుత్వం ప్రజాస్వామ్యకు హక్కులను ప్రశ్నించే గొంతుకను పోరాడే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తుందని , పేద ప్రజలు ఒకే ఏజెండా మీదకి రావలసిన అవసరం ఉందని విప్లవకారులు అమరవీరుల ఆశయ లక్ష్యం కోసం ఒకే వేదిక మీదికి రావలసిన అవసరం నేటి పరిస్థితులు తెలియజేస్తున్నాయని వారు అన్నారు. పేద ప్రజల రాజ్యమే లక్ష్యంగా విప్లవకారులు ఐక్యం కావలసిన అవశ్యకత నేడు ఉందని తెలిపారు..అమరవీరుల ఆశయ సాధన కోసం అందరం కంకణ బద్ధులమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని , అలా ఉద్యమించినప్పుడే వారికి అర్పించే నిజమైన నివాళి అన్నారు.. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గొర్రెపాటి వీరస్వామి ,గ్రామ కార్యదర్శి ఆడెపు నగేష్,కోటయ్య, వంగూరు రవి , రాంబాబు, వీరయ్య, లెనిన్ ,బద్రి తదితరులు పాల్గొన్నారు.





