Sunday, March 15, 2026

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రకాష్..

నేటిసాక్షి, రాయికల్ : సీజనల్ వ్యాధుల పట్ల పాడి రైతులు మరియు గొర్రెల పెంపకందారులు అప్రమత్తంగా వుండాలని, తగు జాగ్రత్తలు తీసుకొని పాడి పశువులను కాపాడుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ప్రకాష్ తెలిపారు. శనివారం రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో జరిగిన ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూడలలో పారుడు రోగం, రక్తపు విరేచనాలు కాల్ఫ్ న్యూమోనియా గొర్రెలలో ప్రధానంగా కాలిపుండు రోగం, న్యుమోనియా వ్యాధులు వస్తాయని తెలిపారు. పాడి గేదెలకు సమీకృత దాణా అందించి మంచి పాల దిగుబడి పొందవచ్చని రైతులకు సూచించారు. మూడు నెలలు పైబడిన అన్ని పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని రైతులకు తెలియజేశారు. ఈ గ్రామంలో సుమారు 220 పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు అదనపు పశు వైద్య శస్త్ర చికిత్సకులు డాక్టర్ నరేష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఎలిగేటి రవీందర్, నాగేందర్ రెడ్డి, శివ కుమార్, కార్యాలయ సహాయకులు షేక్ అహ్మద్, పోచయ్య , రైతులు రాజేష్ , ప్రవీణ్, కొప్పెల గంగారం, గణేష్ , చెల్కల భీమన్న తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైటప్: 01RKL03: పశువులకు టీకాలు వేస్తున్న దృశ్యం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News