Sunday, March 15, 2026

*గునుగులు కొండాపూర్ లో గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు**

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*జాతీయ పశువ్యాధుల నిరోధక కార్యక్రమంలో భాగంగా గునుకుల కొండాపూర్ గ్రామంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యాధి పశువులకు సోకడం వల్ల పశువులలో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి, సామర్ధ్యం తగ్గుతుందని, పాడి రైతులకు ఆర్థికంగా ఎక్కువ నష్టం సంభవిస్తుందన్నారు.4 నెలల వయసు దాటిన పశువులకు ఏడాదికి 2 సార్లు కచ్చితంగా టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్, వీ ఎస్ కె విజయ భాస్కర్, ఎల్ ఎస్ ఏ గునుగులు కొండాపూర్ డైరీ చైర్మన్ జాగిరి శ్రీనివాస్ గౌడ్, నేలపట్ల శంకర్ గౌడ్ ఎం అజయ్, బి దేవేందర్, ఓ ఎస్ ఎం సాగర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News