Sunday, March 15, 2026

*యోగులపర్వతం కార్తీక దీపోత్సవం – దివ్యంగా నిర్వహణకు సిద్ధం**ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి*..

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం**నవంబర్ 1*పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి దివ్య ఆశీస్సులతో, పవిత్ర యోగులపర్వతం వద్ద జరిగే కార్తీక దీపోత్సవం నవంబర్ 5, 2025 న భక్తి, వైభవాలతో వైభవోపేతంగా జరగనుంది.ఈ పవిత్ర కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఆహారం, త్రాగునీరు, ఇతర అవసరమైన సదుపాయాలు సమగ్రంగా సిద్ధం చేయబడ్డాయాని.అదేవిధంగా భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తిశ్రద్ధలతో దీపోత్సవంలో పాల్గొనునట్లు స్వామీజీ తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ గురికాకుండా తగుచర్యలు తీసుకున్నట్లు అన్నారు 5 వ తేదీ ఉదయం నుండే నిత్యఅభిషేకలు పూజలు మొదలవుతాయని దీపోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా 6 అడుగుల ఎత్తైన దివ్య దీపం (కొప్పర) 1503 కేజీల నెయ్యి మరియు 2000మీటర్లు ఒత్తు సిద్ధం చేయబడింది. ఈ దివ్య దీపం ధర్మం, భక్తి, లోకకల్యాణం యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు వేలాది భక్తులు దీపాలు వెలిగించి, ప్రకృతి, ప్రజల, సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయనున్నారు.ఈ దివ్యోత్సవానికి భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రతాప్ స్వామీజీ తెలిపారు ⸻

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News