Sunday, March 15, 2026

**మెంథా తుఫాన్ ప్రభావంతో* పంట నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్**..

*నేటి సాక్షి.. చిలుకూరు మండలం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా చిలుకూరు మండలంలో ఈదురు గాలులు తుఫాను కారణంగా కింద పడిపోయిన వరి పొలాలను సిపిఐ చిలుకూరు మండల బృందం వరి పొలాలను నేడు రైతులతో కలిసి పరిశీలించారు. రైతులు ఆరుగాలం పండించి కష్టపడి పనిచేసే కొన్ని వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి తుఫాను కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నష్ట పోయిన రైతులను ఏకం చేసి పాలక ప్రభుత్వలపై పోరాటం నిర్వహిస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు , పిల్లుట్ల కనకయ్య , మండవ అచ్చయ్య , కట్టెకోల నాగేశ్వర రావు , మౌలానా , కొండ వీరస్వామి, సిద్దెల మనోహర్ , నందిగామ సైదులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News