చెరువులో పడి వృద్ధురాలు మృతి నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 2ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది మండలంలోని పంచాయతీ కేంద్రం పెద్దకొండామర్రి కి చెందిన లక్ష్మమ్మ (75) గ్రామంలోనే ఇంటింటా యాచకం చేసుకుంటూ పొట్ట గడుపుకుంటూ ఉండేది అనాధగా ఉన్న ఆమె దాహార్తిని తీర్చుకునేందుకు గ్రామానికి సమీపంలోని ఎగువకుంటలోకి వెళ్ళింది అక్కడ నీరు తాగుతూ ప్రమాదవశాత్తు కుంటలోనే పడి మృతి చెందింది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..





