నేటి సాక్షి జిన్నారం (బొల్లారం మున్సిపాలిటీ)రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీల పిలుపుమేరకు, ఈరోజు బొల్లారం మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి భారతదేశ సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బొల్లారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కె.జె.ఆర్. ఆనంద్ కృష్ణా రెడ్డి, ఆధ్వర్యంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు రవీందర్ రెడ్డి , శ్రీకాంత్ చారీ, అఖిల్, యోగేశ్వర్, శివ,అరుణ్, బన్నీ, సమీర్,అంబుజ్ కార్యకర్తలు పాల్గొన్నారు.





