Sunday, March 15, 2026

రుద్రవరం టోల్ ప్లాజా…లో..అమ్మో డ్రైనేజీ కాలువపై అత్యవసర రహదారా !.. నిత్యం ప్రమాదాలే… నంద్యాల బ్యూరో నవంబర్ 02,..

నేటి సాక్షి:నంద్యాల జిల్లా పాములపాడు మండలం రుద్రవరం టోల్ ప్లాజాలో అత్యవసర సమయంలో వెళ్లేందుకు వాహనాలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అలాగే అగ్రికల్చర్ ట్రాక్టర్లు ఆటోలు, బైకులు వెళ్లేందుకు డ్రైయిన్ కాలువపై వెళ్లేందుకు పి ఎస్ కె కంపెనీ ఏర్పాటు చేసింది. ప్రతి టోల్ బూత్ వద్ద ఒక ప్రత్యేకమైన “అత్యవసర లేన్” ఉంటుంది, ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తారు.అత్యవసర వాహనాలు (అంబులెన్స్, అగ్ని సిబ్బంది వాహనాలు, పోలీస్ వాహనాలు) టోల్ చెల్లించకుండా ఈ లేన్ ద్వారా వహించబడతాయి. సాధారణ మరణ దృక్పథం ప్రకారం, చక్కగా గుర్తించిన అత్యవసర వాహనాలు, అందరి సహకారంతో వేగంగా ఈ లేన్ ద్వారా వెళ్లడానికి వీలు పడతాయి. ప్రతి టోల్ ప్లాజాలో తీవ్రమైన రవాణా ఇబ్బందులు లేకుండా వాహనదారులు అత్యవసర వాహనాలకు మార్గం చక్కగా ఇవ్వాలి. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన వాహనాలు త్రీ వీలర్ ఆటోలు, బైకులు వెళ్లడానికి ఉపయోగిస్తారు. అయితే నేషనల్ హైవే 340 సి రహదారి లో అత్యవసర రహదారిని ఒక డ్రైనేజీ కాలువపై ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజాలో మొత్తం ఎనిమిది బూతులు ఏర్పాటు చేశారు. ఒకవైపు వెళ్లడానికి నాలుగు బూతులు ఏర్పాటు చేసి 1,2,3 ఫాస్టాగ్ బూతులుగా ఏర్పాటు చేసి 4 లైన్ క్యాష్ లైన్ గా ఏర్పాటు చేశారు. అయితే 4 లైన్ క్యాష్ లైన్ పక్కన డ్రైయిన్ కాలువ ఏర్పాటు చేశారు. ఆ డ్రైయిన్ కాలువపై అత్యవసర వాహనాలు వెళ్లేందుకు రహదారి సిద్ధం చేశారు. ఆత్మకూరు నుంచి నందికొట్కూరు వైపు ఇటుకల ట్రాక్టర్ వెళుతుండగా అత్యవసర రహదారి అంటే డ్రైనేజీ కాలువపై ఏర్పాటు చేసినా రహదారిపై వెళుతూ ఉండగా ఒక్కసారిగా కాలువ పగిలి టైరు కాలువలో ఇరుక్కుపోయింది. క్రేన్ సహాయంతో ట్రాక్టర్ ట్రాలీ ని బయటకు తీశారు. ఈ విధంగా ఎన్ హెచ్ 340 సి టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తుంటే ఎన్ హెచ్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తున్నారా ?లేదా తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారా ? అని వాహనదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. టోల్ ప్లాజా లో అత్యవసర రహదారిని ఏర్పాటు చేయాలానే వాటిని నేషనల్ హైవే అధికారులు మరిచిపోయారేమో.! టోల్ ప్లాజా ప్రారంభమై 16 రోజులు మాత్రమే అయ్యింది, అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా విచిత్రంగా ఉంది. డ్రైయిన్ కాలువపై అత్యవసర రహదారి ఏంటి ? అని టోల్ ప్రారంభంలో ఎన్ హెచ్ అధికారులను ప్రశ్నించారు. వాటిని పి ఎస్ కే కంపెనీ కాంట్రాక్టర్స్ అధికారి మాట్లాడి ట్రైన్ కాలువపై చిన్న చిన్న కడ్డీలతో ఏర్పాటుచేసి వాటిపై సిమెంట్ రోడ్లు గా ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజాలో సూచిక బోర్డులు అప్పుడే నేలపై పడ్డాయి. అక్కడక్కడ అధిక వాహనాలు వెళ్లే దారిలో టోల్ బూతులకు ఏర్పాటుచేసిన రేకులు ధ్వంసం అయ్యాయి. ఈ విధంగా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు ఉన్నారో పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా ? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.!! కొన్ని రోజుల క్రితం తంగడంచ సమీపంలో ఉన్న పారుమంచాల గ్రామం రహదారిలో ఒక లారీ హైవే పైకి వస్తుండగా ఒక్కసారిగా అక్కడే లారీ టైర్లు కూచించుక పోయింది. అంటే ఆ విధంగా నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారని ప్రజలకు అప్పుడే అర్థమైంది. పైన చూడ్డానికి మాత్రమే నీట్టుగా కనిపిస్తాయి. కానీ రోడ్డుపై ప్రయాణిస్తే భయం భయంతో ప్రయాణించాల్సిందే. కొన్ని రోజులకు రోడ్డు నాణ్యత ఇంకా బయటికి వస్తుందని వాహనదారులు తెలుపుతున్నారు. రామకృష్ణ డ్రైవర్ :ఏపీలో ఉన్న టోల్ ప్లాజాలు లో తిరుగుతూనే ఉంటాం కానీ ఇలాంటి టోల్ ప్లాజాను మేము ఎక్కడా చూడలేదని, వీటిని టోల్ ప్లాజా అని అంటారా ? అత్యవసరహదారికి, ఆటోలకు, బైకులకు, ట్రాక్టర్ లు డ్రైనేజీ కాలువపై రహదారులు ఏర్పాటు చేశారు. వీటికి సపరేట్ గా రహదారి ఏర్పాటుచేసి పంపించాలి. అత్యవసర రహదారి వాహనాలకే టోల్ ప్లాజా లో దారి లేదు అటువంటిది రోడ్డు నాణ్యత ఎలావుందో ? అని బయం వేస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News