Sunday, March 15, 2026

ఈ నెల 3న జరిగే విద్య సంస్థల బంద్ కు (పిడిఎస్ యు) సంపూర్ణ మద్దతు…

నేటి సాక్షి,నారాయణపేట నవంబర్ 2, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో 8,500 కోట్ల స్కాలర్శిప్,రీయింబర్స్‌మెంట్ బకాయలను వెంటనే విడుదల చేయాలని( పి.డి.ఎస్.యు) జిల్లా అధ్యక్షుడు ఎస్.సాయికుమార్ అన్నారు. ఈ నెల 3 నుండి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం చేపట్టిన విద్య సంస్థల బంద్ కు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. నారాయణపేట జిల్లా కేంద్రంలోనీ ” భగత్ సింగ్ నగర్ ” భగత్ సింగ్ భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ కళాశాలలు స్కాలర్షిప్,రియంబర్స్మెంట్ పై ఆధారపడి నడుస్తున్నవే , అలాంటి కళాశాలలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి విద్యని అభ్యసిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటికీ విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్లు పెండింగ్లో ఉన్నవి నేటికి ప్రభుత్వం విడుదల చేయడం లేదు.అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పెండింగ్ స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే క్లియర్ చేస్తామని చెప్పిన ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పడం లేదంటే ప్రభుత్వ విద్యపై వారికి ఉన్న స్రవంతి ప్రేమను చూపిస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థం అవుతున్నది. సంవత్సరాల తరబడి స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక కళాశాలలో మూసి వేసుకునే పరిస్థితికి నెట్టబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 3 నుండి కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించకుండా కళాశాలలపై విసిటింగ్ పేరుతో దాడులకు పూనుకోవడం సరైనది కాదు. నిధులు లేవంటూ లక్షల కోట్ల రూపాయలను పక్కదారి పట్టిస్తూ,విద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ,పైసలు ఉన్నోడు చదువుకోవాలి పైసలు లేనోడు పనిచేసుకోవాలనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ,ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి,కళాశాలల యాజమాన్యం కు,పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో (పి.డి.ఎస్. యు) జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ ,జిల్లా కోశాధికారి మహేష్ జిల్లా నాయకులు సురేష్ ,నాయకులు మైపాల్, మణికంఠ ,గురు రాజు తోపాటు తదితదారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News