నేటి సాక్షి:–పాములపాడు మండల కేంద్రంలో సమాధుల పండుగ చాల గొప్పగా ఘనముగా జరిపారు. ప్రతి సంవత్సరం క్రైస్తవులు నవంబర్ 02 తేదీ కచ్చితంగా ఈ సమాధుల పండుగ నీ ఆచరిస్తారు. సీస్ఐ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నీ పాస్టర్ అయ్యగారు మోహన్ గాంధీ గారు, మరియు మాల మహానాడు అధ్యక్షుడు కలబండి.అంకన్న మరియు సోషల్ మీడియా ప్రతినిధి కలబండి.నాగరాజు పాల్గొన్నారు.ఈ సీ స్ ఐ చర్చి దగ్గర నుండి సమాధుల దగ్గర వరకు బ్యాండు లతో.మేళతాళాలతో చాలా సంతోషంగా ప్రార్థనలతో, దేవుడు నీ స్మరించుకుంటూ క్రైస్తవ పాటలు పాడుకుంటూ సమాధుల వరకు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది.అంతేకాకుండా కలబండి., మోహన్ గాంధీ గారు ప్రార్థన తరువాత కొన్ని మాటలు చెప్పడం ఏమిటంటే అయ్యగారి మాట్లాడుతూ ఒకరి పుట్టినరోజు కంటే ఒకరి మరణ దినము గొప్పది, అని ఇలాంటి ఆచారాలు క్రైస్తవులు చాలా గొప్ప విషయం.చనిపోయిన వారికి ఒకరోజు గుర్తుకు తెచ్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం చేయడం ద్వారా నాకు తెలిసి చనిపోయిన లాజర్ నీ సమాధిలో నుండి లేపాడు..ఇలా మనము కూడాదేవుడు కి నమ్మకముగా ఉండటం వలన దేవుని వారసులం అవుతాము.చెప్పడం జరిగింది. ఈ సమాధుల పండుగ కోసం గత రెండు రోజులుగా చాల మంది యువకులు, వృద్ధులు అందరూ ఉచ్చహంగా పాల్గొన్నారు. క్రైస్తవులు శ్మశాన వాటికల్లో సమాధుల పండుగ మృతి చెందిన తమ వారి సమాధుల రంగులు పువ్వులు తో అలంకరించి, వారికి నచ్చిన ఫలహారాలు ఉంచి, కొవ్వతులను, వెలిగించి, పన్నీరు చల్లి, అంజలి ఘటించి స్మరించుకున్నారు. అనంతరం వారి ఆత్మకు శాంతి కలుగుటకు పాస్టర్. మోహన్ గాంధీ గారిచే ప్రతి ఒక్క సమాధి దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు.. ఇది నమ్మకం ఏమిటి అంటే పాస్టర్ అయ్యగారు ప్రార్థన చేసాక తరువాత ప్రజలు విశ్వాసులు నమ్మకం ఏమిటి అంటే చనిపోయిన వారికి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తారు. ఈ క్రైస్తవులు సమస్త పరిశుద్ద ఆత్మల పండుగ దినోత్సవం ఈరోజు నవంబర్ 02 గా కచ్చితంగా చేస్తారు అని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ, విశ్వాసులు, మరియు సంఘ. కాపరి బాలరాజు, బాలస్వామి, సోషల్ మీడియా ప్రతినిధి డక్క. శ్రీకాంత్, కలబండి. నాగరాజు. కలబండి. అంకన్న పాల్గొన్నారు. సంఘ పెద్ద మనసులు, కె.విజయభాస్కర్, పెద్దలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.





