నేటి సాక్షి:— కార్తీకమాసంలో రెండవ సోమవారమైన ఈ రోజు ( 03.11.2025) భక్తులు వేకువజాము నుండే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అలాగే వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారు. దర్శనం ఏర్పాట్లు కార్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు మరియు కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోంది. భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. *దర్శనం* *ఏర్పాట్లు* వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను కొనసాగించాలన్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 10.30ల వరకు దర్శనాలు కొనసాగుతాయి. అదేవిధంగా కార్తీకమాస రద్దీరోజులలో అనగా శని,ఆది,సోమవారాలు శుద్ధఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన రోజులు ( కార్తీకమాసములో మొత్తం 16 రోజులు) స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయబడింది. అదేవిధంగా ఈ రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలుపుదల చేయడం జరిగినది. *సిబ్బందికి* *ప్రత్యేక* *విధులు* భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయి. దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు. *క్యూలైన్లలో* *అల్పాహారం* కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు అల్పాహారం మరియు మంచినీరు అందజేయబడుతున్నాయి. అలాగే ఈ ఉదయం నుంచే భక్తులకు వేడిపాలను కూడా అందజేయడం జరిగింది. *కార్తీకదీపోత్సవం* భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి మరియు గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. *అన్నప్రసాద* *వితరణ* భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయి. అలాగే సాయంత్రం గం. 6.30ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుంది. *లడ్డు* *ప్రసాదాలు* కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయబడ్డాయి. మొత్తం 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేయబడుతున్నాయి.





