Sunday, March 15, 2026

*వేంపెంట గ్రామ నెత్తికొప్పుల.సురేష్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబానికి 5వేలు ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ* *. 1).ఆయనకు సంతాపం తెలిపిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు* పాములపాడు నవంబర్ 03..

నేటి సాక్షి :–పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త నెత్తికొప్పుల సురేష్(40) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పూలమాల వేసి, నివాళులు అర్పించి, ఆయన కుటుంబానికి అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరఫున 5000/-రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలని మీకు అన్ని విధాలుగా తోడుగా వుంటామని ఆయన కుటుంబానికి టేకూరి.రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు ఆయనకు సంతాపాన్ని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బోనపల్లె సత్యరాజు, బూత్ కన్వీనర్- బోనపల్లె వినయ్, సుబ్బారావు, రత్నాకర్, జీవన్న, సురేష్, స్వాములు, జనసేన సంపత్, స్వాములు, పటకారి సామెలు, శ్రీను, ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News