నేటి సాక్షి (జిన్నారం) కార్మిక వ్యతిరేక చర్యలు మానుకోవాలి… బదిలీలు, తీసివేత, సస్పెండ్లను ఎత్తివేయాలి …పోరాటం ఉధృతం చేస్తాం …citu రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య హెచ్చరిక.. కాజిపల్లి లోని శ్రీరామ్ క్లోరోకేం పరిశ్రమ యజమానినీ శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేకులోని డిఆర్ఓ పద్మజారాణి,కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య మాట్లాడుతూ యూనియన్ పెట్టరానే కక్షతో జనరల్ సెక్రెటరీ తో సహా 13 మందిని ఏపీలోని ప్లాంటుకు బదిలీ చేయడం అన్యాయమని ఆయన అన్నారు, బదిలీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, అంతే కాకుండా యూనియన్ నాయకులందరినీ సస్పెండ్ చేయడము, టర్మినేట్ చేయడం జరిగిందని అన్నారు, ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం యూనియన్ పెట్టుకుంటే తొలగించకూడదని ఆయన అన్నారు, పరిశ్రమ యజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందున వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేకపోతే పరిశ్రమ వద్ద పెద్దెత్తున ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. పరిశ్రమలో ఒక యూనియన్ పట్ల ఒక వైఖరి మరో యూనియన్ పట్లు మరోవైఖరి ఎలా ఉంటుందని ఆయన అన్నారు.ఐడి యాక్టివ్ 1926 ప్రకారము యూనియన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన అన్నారు కార్మిక చట్టాలు అంటే ఏమాత్రం గౌరవం లేదని, కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని ఆయన అన్నారు, కార్మికులను రోజు బెదిరింపులు గురి చేస్తుందని, తొలగింపులు చేస్తుందని ఆయన అన్నారు, పరిశ్రమ వైఖరి మార్చుకోకపోతే ఆందోళన పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు. తొలగింపులను, సస్పెండ్లను, బదిలీలను వెంటనే ఎత్తివేయాలని కార్మికులను వీధుల్లో తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, లేకపోతే పెద్ద ఎత్తున అందరం చేస్తామని హెచ్చరించారు





