నేటి సాక్షి, బెజ్జంకి:మండల కేంద్రానికి చెందిన నార్ల సరోజన అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె కొలిపాక ప్రసన్నకు బెజ్జంకి మహిళా పొదుపు సంఘం ఆధ్వర్యంలో రూ. 60 వేల ఇన్సూరెన్స్ చెక్కు సంఘ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో సిద్ధిపేట మహిళా సమితి అధ్యక్షురాలు రాపోలు విజయ, బెజ్జంకి సంఘ అధ్యక్షురాలు బొనగం వినోద, ఉపాధ్యక్షురాలు సంఘ రవళి, పాలకవర్గ సభ్యులు యాంసాని అరుణ, ఒజపెళ్లి సత్యలక్ష్మి, బూర్గుల శ్రీలత, మిద్దె దీపిక, బెజగం శ్రీవాణి, దాసరి మౌనిక, కత్తి లావణ్య, కుసుంబ మంజుల, ఘనకురాలు నార్ల అనురాధ తదితరులు పాల్గొన్నారు.





