Sunday, March 15, 2026

బైక్ అదుపు తప్పి వ్యక్తి దుర్మరణంనేటి..

సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన చొక్కల్ల లక్ష్మయ్య (55), ముదిరాజ్ వడ్లూరు గ్రామంలోని బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.సాయంత్రం ఏడు గంటల సమయంలో యమహా స్కూటీపై బయలుదేరిన లక్ష్మయ్య, వడ్లూరు శివారులో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.మృతుని కుమారుడు చొక్కల్ల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ బోయిన సౌజన్య తెలిపారు.మృతుడు గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News