నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)విద్యార్థుల యొక్క ప్రతిభను పదును పెట్టడానికి చెక్కుముకి పరీక్ష ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసు రావు అన్నారు.కర్లపాలెం మండల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల లో ఉన్న విద్యార్థులకి మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ ను యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎం వి రాజుపాలెం ఉన్నత పాఠశాలలో జరిగాయి.ఈ పరీక్ష ఎన్. కళాధర్ జన విజ్ఞాన వేదిక ప్రతినిధి సమక్షంలో యుటిఎఫ్ ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోలీసురావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి యొక్క శక్తి సామర్థ్యాలకు ఇది చక్కని పరీక్ష అన్నారు.ఇందులో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ నాయకులు బివి శ్రీనివాస్, వైవి నారాయణ, ఎన్ కళాధర్, ఉపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి, సంతోష్, సుబ్బారెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.





