నేటి సాక్షి, బాపట్ల జిల్లా (చందోలు)వాహన యజమానులు వాహనాలకు సంబంధించిన పత్రాలను బండిలోనే ఉంచుకోవాలని చందోలు ఎస్సై శివకుమార్ తెలిపారు.రేపల్లె – బాపట్ల చందొలు జాతీయ రహదారిలో మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీ రామాంజనేయులు, సీఐ హరికృష్ణ ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలను నడిపే వారికి అవగాహన కల్పించడంతోపాటు అపరధ రుసుం విధిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ తలకు గాయాలు కాకుండా కాపాడుతుందన్నారు. కారు నడిపేవారు సీటు బెల్టు ధరించాలని అధికారులు తెలిపే సూచనలను చులకనగా చూడకుండా బాధ్యతగా సూచనలు స్వీకరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ ప్రాణానికి అండగా నిలబడతాయన్నారు. ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహించి వాహనదారులను ఇబ్బందులు గురి చేయడం తమ లక్ష్యం కాదని ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించడం కోసం పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నాలన్నారు. తల్లితండ్రులు ప్రధానంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని మైనర్లు వాహనాలు తోలుతూ ఏదైనా ప్రమాదాలు గురైతే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలను సిబ్బంది పాల్గొన్నారు.





