Monday, March 16, 2026

శిశు సంక్షేమ శాఖ, బాల రక్షాభవన్ శాఖ కార్యాలయంలో విధులకు సక్రమంగా హాజరు కానీ అధికారి…. కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు….!?

నేటి సాక్షి,,నారాయణపేట నవంబర్4, నారాయణపేట జిల్లా కేంద్రంలో గల శిశు సంక్షేమ శాఖ, బాల రక్ష భవన్ కార్యాలయంలో పనిచేస్తున్న జిల్లా అధికారి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు వాపోతున్నారు. బాల కార్మికులు గా ఉన్నప్పుడు డిపాజిట్ చేసిన పదివేల రూపాయలను మేజర్ తర్వాత ఇవ్వాలంటూ బాధితులకు ఇవ్వాలంటూ ప్రభుత్వ ఆదేశాలు ఉన్న అట్టి డబ్బులను ఇవ్వడం లేదంటూ బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. గల బాల రక్షణ భవన్ కార్యాలయంలో పనిచేస్తున్న విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో డిపాజిట్ చేసిన డబ్బులను బాధితులకు తక్షణమే అందించాలంటూ బాధితులు కోరారు లేనియెడల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బాధితుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సంసిద్ధమవుతున్నట్లు బాధితులు వివరించారు. పేట జిల్లా కేంద్రంలోని బాల రక్షణ భవన్ జిల్లా అధికారికి మరో రెండు జిల్లాలు అదనంగా బాధ్యతలు ఇచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. పేట జిల్లా కలెక్టర్ స్పందించి ఇట్టి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News