Monday, March 16, 2026

*విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం*.* బిఎస్పీ గద్వాల్ నియోజకవర్గం అధ్యక్షులు బండారి ఎస్ రాజ్(*జోగులాంబ గద్వాల్ జిల్లా :

నేటి సాక్షి*) జిల్లా కేంద్రం బి ఎస్పీ గద్వాల్ నియోజకవర్గం అధ్యక్షులు బండారి రాజు మాట్లాడుతూ. 8500 కోట్ల ఫీజురియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రైవేట్ కాలేజీలకు ఇంతవరకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం అని అన్నారు, దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది అని అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కాలేజీ మూత పడడం అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతికంగా పరిపాలన చేసే హక్కు లేదన్నారు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి,22 నెలలు నుంచి విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి అని అన్నారు,పెండింగ్లో ఉన్న రూ 8500 కోట్ల ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేసీ విద్యార్థులను ఆదుకోవాలి అన్నారు,లేని యెడల విద్యార్థుల పక్షణ బీఎస్పీ పార్టీ తరుపున మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో బిఎస్పీ నియోజకవర్గం కార్యదర్శి దేవన్న, గద్వాల్ మండలం అధ్యక్షులు గుర్రం గడ్డ శివ, వరకుమార్ పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News