Monday, March 16, 2026

*మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో శ్రీ భార్గవి విద్యార్థు లు ప్రథమ స్థానం** ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకుఅభినందనలు * అభినందనలు తెలిపిన శ్రీ భార్గవి హై స్కూల్ అధినేత పేరాలసురేష్,అధ్యాపకులు

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం) మండల కేంద్రంలోని ఎంవీరాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన చెకుముకి టాలెంట్ టెస్ట్ నందు శ్రీ భార్గవి హై స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మండల స్థాయిలో జరిగిన ఈ పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచిన శ్రీ భార్గవి హై స్కూల్ విద్యార్థులు శవనం వెంకట స్వాతి రావి ఉష షేక్ ముసిమిల్ లకు జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు నామ కళాధర్ మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా కళాధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత 35 సంవత్సరాల నుండి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో చెకుముకి టాలెంట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మండల స్థాయిలో ఎంపికైన శ్రీ భార్గవి హై స్కూల్, విద్యార్థులు నవంబర్ 23న జరిగే జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని జిల్లా జిల్లా స్థాయి పోటీలకు కర్లపాలెం మండలం నుండి ఎంపికైన శ్రీ భార్గవి హై స్కూల్ విద్యార్థులను పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పేరాల వెంకట సురేష్, ప్రిన్సిపాల్ లక్ష్మి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వేణు, లక్ష్మీప్రసన్న సత్య శ్రీ,,దివ్య,సునీత పలువురు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News