నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………,…………………………..జీవో ఎంఎస్ నెంబర్ 25 తేదీ 12.08. 2021 ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యా పరంగా మరియు మీడియంల వారిగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాము కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 25 ప్రకారం కాకుండా కమిషనర్ కార్యాలయం నుండి విభిన్నంగా ఉత్తర్వులు వచ్చినందున, ఉపాధ్యాయుల సర్దుబాటు జీవో 25 ప్రకారం సర్దుబాటు చేయాలని వారన్నారు.





