Monday, March 16, 2026

అదనపు అంతస్థులపై చర్యలుండవా..?ఫిర్యాధులకు స్పందించని రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు

(నేటి సాక్షి) నవంబర్.5:రాజేంద్రనగర్ సర్కిల్,పద్మశ్రీ హిల్స్ హరితవనం కాలనీల్లో జోరుగా అక్రమ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క తెగేసి చెబుతున్న రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. అంతస్తుకు ఒక రేటు ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలు తీసుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ కు,ఈ అక్రమ అంతస్తులపై పలుమార్లు ఫిర్యాదులు అందాయి.ఈ అక్రమ అంతస్తుపై శ్రీధర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందని హరితవనం కాలనీ నివాసితులు ఆరోపిస్తున్నారు. లంచాల మోజులో పడి అధికారులు అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు అందినా కూడా చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోతున్నారని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలో మ్యాన్ పవర్ లేదని చెప్పుకుంటూ కాలం ఎల్లధీశారని ఇప్పుడు మ్యాన్ పవర్ పెరిగినా కూడా అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బహిర్గతం చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News