( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం సెప్టెంబర్ 05:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఉదయం 6 గంటలకే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు *సబితా ఇంద్రారెడ్డి.* నిన్న కురిసిన భారీ వర్షానికి జలమయమైన రామ్ చంద్రగూడ, మరియు పలు విద్యాలయాల పరిశీలన.. చెరువు అలుగు నీళ్లను ఊర్లోకి రాకుండా నాళాలు నిర్మించి బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు..నాళాలు బురదతో కూరుకు పోవడంతో “కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో” భారీగా చేరిన వర్షపు నీళ్లు.. దగ్గరుండి జేసీబీ ల సహాయంతో కూరుకుపోయిన బురదను శుభ్రం చేయించిన ఎమ్మెల్యే ..సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ :- ఈ హఠాత్పరిణామానికి చింతిస్తూ ముందెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించాలని కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడనన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..





