Monday, March 16, 2026

డాక్టరేట్ పొందిన లయన్ రెడ్డి శ్రీనివాస్ రావు కు ఘన సన్మానం

నేటి సాక్షి ఉప్పల్, నవంబర్ 05సామాజిక సేవలో విశేషమైన కృషి చేస్తున్న రెడ్డి శ్రీనివాస్ రావు కు మాలేసియా మాస్ట్రో గ్లోబల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసి, ఆయన చేస్తున్న అపారమైన సేవ కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ అరుదైన గౌరవ దక్కిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో శాలువలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాతు బడుగుల హక్కుల కోసం పోరాటం, ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్ రావు ఉన్నంత చదువుల కోసం హైదరాబాదుకు వచ్చి తొలి దశలో విద్యార్థి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారని అనంతరం ఆయన దృష్టి సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లీందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ లో చేరిన శ్రీనివాస్ రావు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు, సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలిండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో కీలక పాత్ర పోషించి, దాదాపు 15 ఏళ్ల పాటు హైదరాబాద్ జంటనగారల అధ్యక్షులుగా పనిచేస్తూ, ఈ హోదాలో ఆయన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడరు. ఆయన నిస్వార్ధమైన సేవ, సమాజ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా మాస్ట్రో గ్లోబల్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ అందించడం అభినందనీయమన్నారు. సామాజిక సేవకు శ్రీనివాస్ రావు జీవితాన్ని అంకితం చేయడం ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు లక్ష్మణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇంచార్జి. కేశపాగ రామచందర్ మాదిగ ఎంఎస్ పి జిల్లా అధ్యక్షుడు. మనోహర్ ఎంజేఫ్ రాష్ట్ర నాయకులు, అంజి మాదిగ జిల్లా అధికార ప్రతినిధి ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఏళ్ళ సంతోష్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇడపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News