Monday, March 16, 2026

*భక్తులతో కిటకిటలాడిన మానస దేవాలయం*

*నేటి సాక్షి,గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్)* గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో వెలసిన స్వయంభు మానస దేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి, మానస దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివ నామస్మరణలతో మారుమ్రోగింది. కార్తీక దీపాలు వెలిగించి ముక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రరెడ్డి, ప్రధాన అర్చకుడు అమర్నాథ్ శర్మ భక్తులు పాల్గొన్నారు. గన్నేరువరం ఎస్సై జి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం అవాంఛనీయ ఘటనలు కలగకుండా పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News