నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు..సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు ఉదయం వాకింగ్‌కు వచ్చే ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.*మార్నింగ్ వాకర్లతో చర్చించిన పోలీసులు*ఉదయం వాకింగ్‌కు వచ్చే ప్రజలను పోలీసులు కలుసుకుని సైబర్ మోసాల నుంచి రక్షించుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ‘ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా లింకులు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు దొంగిలించి ఖాతాల్లోనుంచి డబ్బు లాగుతున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’అని అధికారులు వివరించారు.*ప్రజలకు జాగ్రత్త సూచనలు*పోలీసులు ప్రజలకు ఈవిధంగా పలు సూచనలు చేశారు..• అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయకూడదు.• బ్యాంక్ వివరాలు, OTP, ఆధార్, పాన్ వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.• ఆన్‌లైన్ షాపింగ్ లేదా ట్రేడింగ్ చేసేప్పుడు అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి.• ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.*అవగాహనతోనే భద్రత*అదే విధంగా జిల్లా పోలీసులు మరింతగా మాట్లాడుతూ ‘ప్రజల్లో చైతన్యం పెరిగితేనే సైబర్ నేరాలను అరికట్టవచ్చు. భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మోసపోవాల్సిన అవసరం ఉండద’ని స్పష్టం చేశారు.సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ జాగ్రత్తలను అలవాటు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు._______





