నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి కుప్పిరెడ్డి నాదముని రెడ్డి గారు గత నాలుగు రోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. చంద్రగిరి పట్టణంలోని కుప్పి రెడ్డి నివాసంకు గురు వారం చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాదముని రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు నివాళులు అర్పించిన స్థానిక మండల పార్టీ నేతలు, కార్యకర్తలు వున్నారు.





