Monday, March 16, 2026

మజారా గ్రామాలు అబివృద్ధి శూన్యం అధికారుల నిర్లక్ష్యం.. ఎం . రమేష్ బాబు సీపిఐ.. జిల్లా కార్యవర్గ సభ్యులు… .పిజిఆర్ఎస్ దరఖాస్తులను పట్టించుకోవడం లేదు.. నిర్లక్ష్యం చేస్తే నిరాహార దీక్ష తప్పదు.. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు.జూపాడుబంగ్లా 06 నవంబర్

నేటి సాక్షి:–.. జూపాడు బంగ్లా మండలం పారుమంచాల మజార సిద్దేశ్వరం, గ్రామంలో ఒక్క వీధిలో కూడా సిసి రోడ్లు లేవని వీధిలైట్లు పాడైపోయాయని పట్టించుకునే నాధుడే లేడని, సంవత్సరం నుండి ఈ గ్రామాన్ని సందర్శించిన అధికారి ఒక్కరూ కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం తెలుస్తుందని తక్షణమే ఈ సిద్దేశ్వరం, చాబోల్ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో నిరాహారదీక్ష చేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు.. గురువారం మండలంలోని సిద్దేశ్వరం చాబోలు గ్రామాలను వారు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయాలు ఏర్పడిన నాటి నుండి ఇంతవరకు ఏ ఒక్క అధికారి మజారా గ్రామాల్లో పర్యటించిన పరిస్థితి లేదని ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని రోడ్లు బురదమయంతో వీధిలైట్లు లేక రాత్రి వేళల్లో భయం తో ప్రజలు బిక్కు బిక్కు మని నివసిస్తున్నారని అధికారులకు కనపడడం లేదా అని వారు ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి నుండి మండల అధికారుల వరకు మజారా గ్రామాల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.పెన్షన్ బియ్యం తీసుకోవాలన్న ఐదు కిలోమీటర్లు వీళ్లు నడవాల్సిందే అని వారన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు ఉన్నాయి తప్ప సిద్దేశ్వరం, చాబోలు గ్రామాల్లో ఒక్క సీసీ రోడ్డు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. రాజకీయ నాయకులు అందిన కాడికి దోచుకునేందుకు తెగబడ్డారు తప్ప పేదలకు సంక్షేమ ఫలాలు అందించే పరిస్థితిలో లేదన్నారు.. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన కాగితాల వరకే పరిమితమయ్యాయని పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. ఆఫీసులకే పరిమితమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి కి ఫిర్యాదు చేస్తామని అవసరమైతే నిరాహార దీక్షకు సిద్ధమని వారు హెచ్చరించారు..ఈ కార్యక్రమం లో సీపీఐ మండల నాయకులు తిరుపతయ్య, నరసింహ, బాషా గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News