నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 6రోడ్డు కట్టంగా చింత చెట్టు పడి ట్రాఫిక్ అంతరాయం వాటిల్లింది పోలీసులు తొలగించడంతో యధావిధిగా కొనసాగింది చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి మార్గమధ్యలోని మేకలవారిపల్లి పాఠశాల సమీపంలో గల తరాల నాటి చింతచెట్టు రోడ్డుపై పడింది దీంతో మదనపల్లి చౌడేపల్లి ప్రధాన రహదారిలో తిరుగుతున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది చెట్టును తొలగించడంతో వాహనాలు యధావిధిగా తిరిగాయి వందలాది సంవత్సరాలుగా ఉన్న చింత చెట్టు ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై పడిందని స్థానికులు అన్నారు





