*(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 06:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని కోళ్ల పడకల్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని రైతు చేపంగి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అకాల వర్షాలకు రైతుల పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గుర్తించి,నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని కోరుతూ,రైతు మన దేశానికి అడ్డుగోడ.అకాల వర్షాలు,ప్రకృతి విపత్తుల వల్ల రైతు బీదరికంలో మునిగిపోకుండా ప్రభుత్వం తక్షణ సాయం అందించాలి,అని జగన్ అన్నారు.మంగళవారం భారీ వర్షం కారణంగా పెద్దకుంట చెరువు సమీపంలోని పంట పొలాలు నీటమునిగిపోయాయని,వరి,పత్తి,మొక్కజొన్న ,కూరగాయలు మరియు ఇతర పంటలు పాడైపోయాయని తెలిపారు.మండల అధికారులు, గ్రామ పెద్దలు కలిసి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఆయన కోరారు.





