Monday, March 16, 2026

కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి…

నేటి సాక్షి, నారాయణపేట,నవంబర్ 6,నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ లబ్ధిదారులకు ముగ్గు వేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చినట్టుగా మాట ప్రకారం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు, పార్టీలకతీతంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేని టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయం లో రాజకీయం చేస్తున్నారని అన్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా పేద ప్రజలకు అర్హులు కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు, అలాగే లబ్ధిదారులు కూడా ప్రభుత్వ సూచనల మేరకు ఇల్లు నిర్మించుకోవాలని ఐదు లక్షలు ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో డబ్బులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు, కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొనుంగేరి హనుమంతు, మాజీ సర్పంచ్ జయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లక్ష్మారెడ్డి, కోటకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు యాదగిరి, భీమేష్ బండ కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచందర్, తిరుమలాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ రాజు, నారాయణరెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News