Monday, March 16, 2026

మున్సిపల్ కార్మికులు 2వరోజు నిరసన.మున్సిపల్ కార్మికులకు 2 సంవత్సరాల పెండింగ్ యూనిఫాంలు, సబ్బులు నూనెలు, బూట్లు,గ్లౌజులు, శీతాకాలం జెర్కిన్లు ఇవ్వాలి. కనీస వేతనాలు 26వేల అమలు చెయ్యాలి. పెండింగ్ పీఫ్ డబ్బులు 2011నుండి ఇవ్వాలి. పండగలకు సెలవులు, బోనసులు ఇవ్వాలి- తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్.

నేటి సాక్షి వికారాబాద్: వికారాబాద్ జిల్లా లో 2వరోజు వికారాబాద్ మున్సిపల్ యూనియన్ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ నాయక్ అధ్యక్షతన మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ పాల్గొని మాట్లాడుతూ గత 2ఏండ్లుగా మున్సిపల్ కార్మికులకు రావాల్సిన యూనిఫాంలు సబ్బులు నూనెలు బూట్లు బ్లూజులు వనకాలం చలికాలం జెర్కిన్లు జాకెట్లు ఇవ్వలేదు. పెండింగ్ పీఫ్ డబ్బులు 2011నుండి 2015 వరకు రావలసి ఉంది నేటికి ఇవ్వలేదు. సమాన పనికి సమన వేతనాలు ఇవ్వడం లేవు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26వేలు అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి కనీస వేతనాలు అమలు చెయ్యాలి. జిల్లా అధికారులు రెగ్యులర్ వేతనాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వనికి జిల్లా యూనియన్ సీఐటీయూ గా డిమాండ్ చేస్తున్నాము.లేనిచో ఆందోళనలు నిరసనలు చేపడతామని ప్రభుత్వనికి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు జంగమ్మ కమలాబాయి ధర్మి బాయి మరియమ్మ శేఖర్ రాములు సంతోష్ కిషన్ శ్రీను అరుణ్ బాబు దశరథ్ వెంకటయ్య గట్టయ్య భాస్కర్ బందమ్మ శంకర్ మల్లేష్ నట్సిములు మహేందర్ అనంతయ్య బీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News