*(మనసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 06:)*శంకర్‌పల్లి మండలంలోని పొద్దటూరులో ప్రగతి రిసార్ట్స్‌లో రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ ఆధ్వర్యంలో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలు,వాటి పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం,జాప్యంపై విస్తృతంగా చర్చించారు.ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోవడం పట్ల సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది.గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేసినట్లు గుర్తుచేసింది.ఇంటి స్థలాలు,ఆరోగ్య పథకం,అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలను త్వరితగతిన పరిష్కరించాలని సమావేశం ప్రభుత్వం ను డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా ఐజేయు జాతీయ అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉందన్నారు.ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.ఫిబ్రవరి మొదటి వారంలో విజయవాడలో జరగనున్న ఐజేయు జాతీయ ప్లీనరీ విజయవంతం చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.జనవరిలో రాష్ట్రంలోని హైదరాబాద్,వరంగల్,కరీంనగర్ కేంద్రాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు సమావేశం నిర్ణయించింది.ఇటీవల అకాల మరణం చెందిన 16 మంది జర్నలిస్టులకు నివాళి అర్పిస్తూ,మౌనం పాటించింది.సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా శాఖకు కృతజ్ఞతలు తెలిపింది.





