Tuesday, March 31, 2026

జల్పల్లిలో వ్యక్తి అదృశ్యం – పోలీసుల గాలింపు

*(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 06:)*బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామానికి చెందిన గుజ్జరోలు అశోక్ (36) అనే వ్యక్తి గురువారం నుండి కనిపించడంలేదని ఆయన భార్య గుజ్జరోలు అర్చన (32) ఫిర్యాదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం – నవంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో అశోక్ తన ఆటోలో మొబైల్ ఫోన్ ఉంచి దుర్గానగర్‌లో టీ తాగడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి మొబైల్ కనిపించలేదని తెలిసింది.ఆ విషయం తర్వాత ఇంటికి వచ్చి మద్యం సేవించి మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయాడు.సాయంత్రం 6 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా కనపడలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.అదృశ్యమైన వ్యక్తి వివరాలు:తెల్లగా,ఎత్తు 5.4 అడుగులు,తెలుగు, హిందీ భాషలు మాట్లాడగలడు.ఇంటి నుండి బయలుదేరినప్పుడు తెలుపు రంగు షర్ట్, నీలం రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News