Friday, March 20, 2026

ఆన్ లైన్ మోసాలపై విద్యార్థులు.అప్రమత్తంగా ఉండాలి: రాజేంద్రనగర్ డిసిపి యోగేష్ గౌతమ్ ఐపీఎస్శంకర్‌పల్లి: నవంబర్ 06:

( నేటి సాక్షి): విద్యార్థులు ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ డిసిపి యోగేష్ గౌతమ్ (ఐపీఎస్) అన్నారు. గురువారం శంకర్‌పల్లి మండల పరిధిలోని దొంతాన్ పల్లి గ్రామ శివారులో గల ఇక్ఫాయ్ కళాశాలలో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు సైబర్ జాగరూక్తా దివస్ పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ యోగేష్ గౌతమ్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, క్రెడిట్ కార్డ్స్ సంబంధిత మోసాలు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, లోన్ యాప్ లు, ఓటిపి, సైబర్ క్రైమ్ పోర్టల్ ల పై వివరించారు. ఒకవేళ ఇలాంటి ఏవైనా మీ మొబైల్ ఫోన్ కు వచ్చినచో వెంటనే స్పందించి పోలీస్ శాఖకు లేదా 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్ లో ఓటిపికాని, బ్యాంక్ ఖాతా నంబర్లు కానీ, ఆధార్ నంబర్ కానీ, పోలీసు వాళ్ళ డిపితో వచ్చిన కాల్స్ కు కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని వివరించారు. కార్యక్రమంలో మోకిల సిఐ వీరబాబు గౌడ్, ఎస్సై లు కోటేశ్వరరావు, చెన్నారెడ్డి, ఇక్ఫాయ్ ఇన్చార్జి, వైస్ ఛాన్స్ లర్ ప్రొ. డా. తమ్మ కోటిరెడ్డి, రిజిస్టర్ డా. ఎస్ విజయలక్ష్మి, డైరెక్టర్ లు ప్రొ. డా. వేణుగోపాలరావు, డా. కేఎల్ నారాయణ, జాయింట్ రిజిస్ట్రార్ వి మధుసూదన్ రావు, హర్షిత్, అభిషేక్ చౌదరి, దృష్టి, సౌరన్ షా, ఔరోబింద్, అంజోనావో దాస్, శ్రేయా సింగ్, మౌలి శ్రీవాస్తవ, ఆదిత్య, ప్రతాప్ సింగ్, అధ్యావి ఆదర్శ్, అర్చన దాస్, అదితి షిండే, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News