నేటి సాక్షి మహబూబాబాద్ నరసింహుల పేట (భూక్యా రవి నాయక్) నవంబర్ 6 మహబూబాబాద్ జిల్లా, నరసింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామ శివారులో ఆకేరు వాగు వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారం ఆధారంగా రెవెన్యూ శాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు.దీంతో అక్కడ ఇసుకతో నిండిన రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయని గ్రామస్థులు తెలిపారు. అయితే, కొద్ది సేపటికి రెవెన్యూ అధికారులు “చర్చల అనంతరం” ఆ ట్రాక్టర్లను వదిలేశారనే వార్త ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.స్థానికులు ఈ ఘటనపై ప్రశ్నిస్తున్నారు —> “చట్టం అందరికీ సమానమైతే, అక్రమంగా ఇసుక తవ్వినవారిని ఎందుకు వదిలేశారు?”ఇక ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు.సమాచారం ప్రకారం, ఇసుక రవాణాలో కొంతమంది ప్రభావశీలులు కూడా ప్రమేయం ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.–





