Monday, March 16, 2026

ఉచిత విద్య, వైద్యంను ప్రభుత్వం పేదలకు దూరం చేస్తోంది– ఒక్క సంతకంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కాపాడుకుందాం – కమీషన్ల కోసం కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోంది– నడవలూరు కోటిసంతకాల సేకరణలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రామచంద్రాపురంరాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యంను ప్రభుత్వం పేదలకు దూరం చేస్తోందని, ప్రభుత్వ కుట్రలను అడ్డుకునేందుకు చేపట్టిన ప్రజా ఉద్యమంలో అందరూ భాగస్వాములై ఒక్కసంతకం పెట్టాలని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో గురువారం జరిగిన కోటి సంతకాల సేకరణలో ఆయన పాలుపంచుకున్నారు. ముందుగా గ్రామస్తులతో సమావేశమైన ఆయన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న కట్టిస్తే ఆ కాలేజీలను నిర్వహించడం కూటమి ప్రభుత్వానికి చేతకాక ప్రయివేటుపరం చేస్తోందన్నారు. కొన్ని కాలేజీలు దశల వారీగా నిర్మాణాలు ఆగిపోతే వాటిని పూర్తి చేయలేక కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెడుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మొదటి రెండేళ్లు కరోనాతో కాలం గడిచిపోగా మిగిలిన మూడేళ్ల కాలంలో 17 మెడికల్‌ కాలేజీలను కట్టించిన ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం జగనన్న చేశారని, పేద ప్రజలకు మెరుగైన వైద్యవిద్య, కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించాలని తపన పడ్డారన్నారన్నారు. జగనన్న ప్రభుత్వం పేదలకు మంచి జరగాలని చిత్తశుద్ధితో ఆలోచన చేసి మెడికల్‌ కాలేజీలను కట్టిస్తే ఈ కూటమి ప్రభుత్వం కమీషన్లు కోసం కక్కుర్తిపడి వాటిని ప్రయివేటు పరం చేస్తోందన్నారు. పేదలకు అందాల్సిన ఉచిత వైద్యం, విద్యార్థులకు వచ్చే మెడికల్‌ సీట్లును రాకుండా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమే అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా బావిస్తున్నామన్నారు. భారత దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి రాలేదని, అది కూడా పిపిపి పద్దతిలో ప్రయివేటు వ్యక్తులకు 66 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా జీఓలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. 66 ఏళ్ల తరువాత ఆ భవనాలు పదిలంగా ఉంటాయా..? అక్కడ ప్రజలకు అనుకున్నంత స్థాయిలో వైద్యం దొరికే పరిస్థి ఉంటుందా ? అన్న విషయాలు అందరూ ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తోందా.. పెద్దలు కోసం పని చేస్తోందా అర్థం కావడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రయివేటు పరం చేసే కుట్రలను ఆపాడానికి రాజ్యాంగ పరిరక్షకులైన రాష్ట్ర గవర్నర్‌కు ప్రజల సంతకాలతో కూడిన ప్రతులను అందజేసే బృహత్తరమైన కార్యక్రమానికి జగనన్న పిలుపునిచ్చారన్నారు. ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ప్రజా ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్‌రెడ్డి, నడవలూరు సర్పంచ్‌ గణపతిరెడ్డి, వైస్ ఎంపిపిలు కవితా భాస్కర్ యాదవ్, లావణ్య చంద్రబాబు,టి.గిరిధర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు బోడిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మండల పార్టీ మహిళాధ్యక్షురాలు జ్యోతి, పవన్‌కుమార్‌రెడ్డి, మండల ఎస్సీసెల్‌ అధ్యక్షులు నెల్లేపల్లి వెంకటేష్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు యశ్వంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు గంగరామిరెడ్డి, ముచ్చేలి భాస్కర్‌రెడ్డి, వెంకటరెడ్డి, బాబురెడ్డి, వైస్ ఎంపిపిలు కవిత భాస్కర్ యాదవ్, లావణ్య చంద్రబాబు, లక్ష్మి నారాయణ రెడ్డి, వాసుదేవ రెడ్డి, గిరిధర్ రెడ్డి,హరిరెడ్డి, సతీష్ రెడ్డి, యం.వెంకట మునిరెడ్డి, ఎన్ వెంకట మునిరెడ్డి , చిరంజీవి నాయుడు, నాదెండ్ల గోపి చౌదరి, పురుషోత్తం నాయుడు,ఇరగమరెడ్డి,మాధాసు మురగయ్య,హిమాల్ రెడ్డి, గురుస్వామి రెడ్డి, భాస్కర్ రాయలు గ్రామస్తులు, వైఎస్సార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News